News
మంత్రిని హతమార్చిన కూలీలు
ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో బొలివియాలో డిప్యూటీ హోంమంత్రిని హతమార్చారు గనికార్మికులు. ఈ విషయాన్ని బొలివియా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. అధిక రాయితీలు కల్పించాలని, ప్రైవేటు కంపెనీలో పనిచేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ బొలివియాలోని గనికార్మికులు గత మంగళవారం నుంచి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. హైవేలపై ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు పండురో ప్రాంతంలో డిప్యూటీ హోంమంత్రి రొడాల్ఫో ఇలేన్స్, అతడి వ్యక్తిగత సిబ్బందిని కిడ్నాప్ చేశారు. రొడాల్ఫోను కార్మికులు అతిదారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనతో స్థానికంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.ఈ సందర్భంగా పోలీసులు, గనికార్మికులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు కూలీలు మృతి చెందారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








